మౌలిక వసతుల కల్పనకు కృషి

తాండూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్ అన్నారు. శుక్రవారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సమావేశం జరిగింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులు, వ్యాపారులకు కల్పించాల్సిన వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్‌నాయక్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రూ.75 లక్షలతో షెడ్ నిర్మాణం, రూ.7 లక్షలతో మరుగుదొడ్లు, రూ.5 లక్షలతో సీసీ కెమెరాలు, రూ.10 లక్షలతో ఖాంజాపూర్ గేట్ సమీపంలోని పశువుల సంతలో సీసీ రోడ్డు, సీసీ కెమెరాలు, నీళ్ల కుండీలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు తీర్మానించినట్లు వెల్లడించారు. అతి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ముఖ్యంగా రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ముందెన్నడూ లేని విధంగా రైతులకు ప్రత్యేక సమావేశాల కోసం ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు.
రైతులు భూముల అమ్మకాలు, కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహకారంతో తాండూరు వ్యవసాయ మార్కెట్ కోసం త్వరలో స్థలాన్ని గుర్తించి భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామన్నారు. అందుకు వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు సహకరించాలని కోరారు. రైతులు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ఎల్మకన్యె పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భీంరెడ్డి, వీరేందర్, ఆశప్ప, పద్మమ్మ, సప్తగిరిగౌడ్, ఇర్ఫాన్, మల్లప్ప, దినేశ్‌సింగ్, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీట్రూట్ కబాబ్
- ఇక మహీంద్రా ఈవీతో అమెజాన్ ఉత్పత్తుల డెలివరీ
- డిజిటల్ పేమెంట్స్‌కు ఐసీఐసీఐ, యాక్సిస్‌లతో అమెజాన్ పొత్తు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ