నాలుగేండ్లు.. రూ.40 కోట్లు

- అభివృద్ధే ధ్యేయంగా నిధుల మంజూరు
- పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
- జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డి
- ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
వికారాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లా పరిషత్ నుంచి గత నాలుగేండ్లుగా 500 పనులకుగాను సుమారు రూ.40 కోట్ల నిధులను విడుదల చేశామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి. సునీతామహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు పనులకు సంబంధించి తన ప్రమేయం లేకుండానే పనుల ఒప్పందాలు పూర్తి చేయడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇకపై ఏ పనులైనా నా అనుమతి లేకుండా చేయరాదని ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీ భవనాల నిర్మాణానికి రూ.4 కోట్లను మంజూరు చేయగా, అనువైన స్థలాలు లేకపోవడంతో పెండింగ్ ఉన్నట్లు, త్వరితగతి న స్థలాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారుల నిర్మాణం నిమిత్తం రూ.7 కోట్ల నిధులను మంజూ రు చేశామన్నారు. అంతేకాకుండా కల్వర్టులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, కల్వర్టులు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో రోడ్లు కొట్టుకుపోతున్నాయన్నారు. 15వ ఆర్థి క సంఘం నిధులతో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
జడ్పీ నిధులతో రోడ్లతోపాటు తాగునీటి సదుపాయం కల్పించే పనులు, ఇంకుడు గుంతలు పనులు అస్తవ్యస్తంగా మారిన ధారూర్ మండలం కెరెళ్లి వద్ద రహదారికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.కొడంగల్,దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో అభివృద్ధి పనులకుగాను మహబూబ్‌నగర్ జడ్పీ నుంచి రూ.3.90 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఆమె వెల్లడించారు.సమావేశంలో జడ్పీ సీఈవో ఉష, డీఆర్డీవో కృష్ణన్, పంచాయతీరా జ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ బాబు శ్రీనివా స్, ఆర్అండ్బీ ఈఈ లాల్‌సింగ్ పాల్గొన్నారు.
కోరంలేక జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
కోరం లేకపోవడంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశా న్ని వాయిదా వేసినట్లు జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి తెలిపారు. కోరం లేకపోవడంతో తొలుత గంట వాయిదా వేసినప్పటికీ సరిపోను సభ్యులు హాజరుకాకపోవడంతో వా యిదా వేస్తున్నట్లు, తర్వాత సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం