రైతులతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

- డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
- బీర్కూర్ డీసీసీబీ మేనేజర్‌పై ఆగ్రహం
- రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం
బీర్కూర్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిబ్బంది ఎవరైనా రైతులతో దురుసుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. బీర్కూల్లోని డీసీసీబీని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు మేనేజర్ శివశంకర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సేవ చేయని మీకు ఉద్యోగం ఎందుకని తీవ్రంగా మందలించారు. రైతులు తనకు గతంలో కూడా ఫిర్యాదు చేశారని, మార్పు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. సరిగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ రూ.20 లక్షలను తీసుకువచ్చి రైతుకు రూ.20 వేల చొప్పున అందజేస్తున్నామని చెప్పడంతో డీసీసీబీ సీవోతో ఫోన్లో మాట్లాడి.. శుక్రవారం నుంచి బీర్కూర్ డీసీసీబీకి రూ.40 లక్షలు పంపాలని చెప్పారు. అవసరం ఉన్న రైతులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అందజేయాలని మేనేజర్‌కు సూచించారు. మిర్జాపూర్ గ్రామానికి చెందిన కిష్టయ్య శుక్రవారం పెండ్లి ఉన్నదని, డబ్బులు ఇవ్వాలని మేనేజర్‌ను ప్రాధేయపడ్డా ఇవ్వలేదని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతులకు వెంటనే డబ్బులను ఇప్పించారు. ఆయన వెంట బీర్కూర్ ఎంపీపీ రఘు, వైస్ ఎంపీపీ కాశీరాం, కో-ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, ఎంపీటీసీ సందీప్పటేల్, సొసైటీ చైర్మన్ గాంధీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, నాయకులు దుంపల రాజు, కొరిమె రఘు, మల్లారెడ్డి, అవారి గంగారాం తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ