మంగళవారం 26 జనవరి 2021
Vikarabad - Dec 02, 2020 , 04:25:51

జీవాలకు నట్టల నివారణ మందు తప్పనిసరి

జీవాలకు నట్టల నివారణ మందు తప్పనిసరి

పరిగి : జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు వేయించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి సూచించారు. మంగళవారం పరిగి మండలం మిట్టకోడూర్‌ గ్రామంలో జీవాలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వరకు నట్టల నివారణ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జరుగుతుందని తెలిపారు. నట్టల మందుల వల్ల జీవాలలో సకాలంలో బరువు పెరుగడంతోపాటు పునరుత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. పశుగ్రాస విత్తనాలు త్వరలోనే ప్రతి పశువైద్యశాలలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమం ఈ నెలలోనే చేపడుతారన్నారు. అనంతరం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి డాక్టర్‌ వసంతకుమారి, సహాయ సంచాలకులు డాక్టర్‌ సదానందం, డాక్టర్‌ ప్రహ్లాద్‌, డాక్టర్‌ అమరాజు, పశువైద్యాధికారులు సుజాత్‌అలీ, నాగప్రసాద్‌, ఆనంద్‌, సర్పంచ్‌ జయలక్ష్మి, ఎంపీటీసీ జహీరాబేగం, ఉపసర్పంచ్‌ నర్సింహులు పాల్గొన్నారు. logo