మంగళవారం 26 జనవరి 2021
Vikarabad - Dec 02, 2020 , 04:17:25

బ్యాగ్‌ ఫిల్లింగ్‌ త్వరగా పూర్తి చేయండి

బ్యాగ్‌ ఫిల్లింగ్‌ త్వరగా పూర్తి చేయండి

 పెద్దేముల్‌ : వన నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం కొనసాగుతున్న బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో లక్ష్మప్ప సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కందనెల్లి తండా, బుద్దారం, గొట్లపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, మొక్కల పెంపకానికి వన నర్సరీల్లో కొనసాగుతున్న పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మొత్తం 37 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో కొనసాగుతున్న పనులను ప్రతిరోజూ 4 నుంచి 5 గ్రామాల్లో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు.

 ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రా మ పంచాయతీ పరిధిలో తప్పకుండా వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా వన నర్సరీల్లో మొక్కల పెంపకానికి విత్తనాల టార్గెట్‌ల ప్రకారం ప్రైమరీ బెడ్‌లను నిర్మించుకోవాలని, నర్సరీల్లో బెడ్‌లు ప్రతి వరుసకు వేయి ఉండేవిధంగా అమర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాల్లో ఇదివరకు నాటిన ప్రతి మొక్కకు తప్పనిసరిగా సపోర్ట్‌ కర్రలను  అమర్చాలని సూచించారు. వీలైనంత త్వరగా నర్సరీల్లో బ్యాగ్‌ ఫిల్లింగ్‌ను పూర్తి చేయాలని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.కార్యక్రమంలో కార్యదర్శులు వాణి, అరుణజ్యోతి, రాజు, టీఏ విజయ్‌ పాల్గొన్నారు.


logo