పైప్‌లైన్‌కు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలి

- వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య
పరిగి : రోడ్డు విస్తరణ పనులు వేగంగా నిర్వహించడంతోపాటు మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. మంగళవా రం పరిగిలో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల నుంచి మంచినీటి పైప్లైన్లు, ప్రత్యేకంగా మిషన్ భగీరథ పైప్లైన్లు ఉండడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తవని ప్రాంతాలలో మరింత వేగంగా చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు పనులు చేపట్టిన తర్వాత తవ్వకుండా ముందుగానే పైప్‌లైన్, ఇతర పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలో ఏఏ రకాల మొక్కలు, ఎన్ని పెంచుతున్నారని అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కల పంపిణీతోపాటు పట్టణంలో ని ప్రధాన రహదారులకు ఇరువైపులా అందమైన మొక్కలు నాటేందుకు అవసరమైన సంఖ్యలో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కమిషనర్ ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకుడు బి.రవికుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు