శుక్రవారం 15 జనవరి 2021
Vikarabad - Dec 01, 2020 , 04:37:12

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

వికారాబాద్‌: కార్తిక పౌర్ణమి వేడుకల సందర్భంగా వికారాబాద్‌ పట్టణం సోమవారం  కార్తిక శోభను సంతరించుకుంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రజలు తమ తమ ఇండ్లలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కొవిడ్‌ 19 కారణంగా అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామి దేవాలయాన్ని మూసేశారు. దీంతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ధారూరు : ధారూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కార్తిక మాసం సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, యవకులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో దీపాలు వెలిగించి ఈ ఏడాది సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఉపవాస దీక్షలతో మహిళలు సాయంత్రానికి దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మోమిన్‌పేట: కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తు లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని గ్రామాల్లో భక్తులు తులసిదేవికి పూజలు చేశారు. మో మిన్‌పేట విఠలేశ్వర, ఎన్కతల శివాలయం, టేకులపల్లి ఆంజనేయస్వామి, వెల్‌చాల్‌ లక్ష్మీనర్సింహా స్వామి, రాళ్లగూడుపల్లి రామలింగేశ్వర ఆలయాల్లో పూజలు జరిపించారు. చంద్రాయన్‌పల్లి గ్రామంలోని బిక్కరెడ్డి బావుల దగ్గర అనంత పద్మనభస్వామికి అర్చకులు ఘనంగా కల్యాణం జరిపించారు.