శుక్రవారం 15 జనవరి 2021
Vikarabad - Dec 01, 2020 , 04:34:47

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

పరిగి : ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌ పేర్కొన్నారు. సోమవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని విజయ్‌నగర్‌ కాలనీలో రూ.3.20లక్షలతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డు పరిధిలో మున్సిపల్‌ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఆయా కాలనీల్లో అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు సెట్‌ బ్యాక్‌ వదలాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సహకారంతో పరిగిని మరింత ప్రగతి పథంలోకి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌టీఆర్‌ఎస్‌ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, కొప్పుల వర్షిత్‌రెడ్డి, కౌన్సిలర్‌లు ఎదిరె కృష్ణ, రవీంద్ర, వెంకటేశ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు శేఖర్‌, నాయకులు తాహెర్‌ అలీ, బషీర్‌ పాల్గొన్నారు.