సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Nov 29, 2020 , 04:49:38

కస్తూర్బాగాంధీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

కస్తూర్బాగాంధీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

కోట్‌పల్లి: వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మం డల కేంద్రంలో కస్తూర్భాగాంధీ పాఠశాల నిర్మాణానికి శనివారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కోట్‌పల్లి కొత్త మండలంలో కస్తూర్భాగాంధీ సొంత పాఠశాల భవనం లేక, గతంలో కొనసాగిన ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోనే తాత్కాలికంగా కొనసాగించడం జరుగుతుందని, దీంతో విద్యార్థులకు ఆ పాఠశాలలో హాస్టల్‌తోపాటు పాఠశాల గదులకు ఇబ్బందులు రావడం జరుగుతుం ది. ప్రత్యేకంగా భవనం కావాలని కొంతకాలంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత అధికారులకు వినతులు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే రెవె న్యూ అధికారులు మూడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని సూచించారు. అందుకు శనివారం జిల్లా విద్యాధికారి రెవెన్యూ అధికారి రాంరెడ్డితో కలిసి ఎన్కేపల్లిలో 63 సర్వేనంబర్‌లో 4.28,రాంపూర్‌లో 109 సర్వేనంబర్‌లో 1.13, బార్వాద్‌ గ్రామంలో 163 సర్వేనంబర్‌లో 2.00ఎకరాల ప్రభుత్వ భూమిని సందర్శించి పరిశీలించారు. ఈ స్థలాలపై కలెక్టర్‌కు నివేధిక అందించి, కలెక్టర్‌ ఫైనల్‌ చేసిన రిపొర్టు అనుగుణంగా భవన నిర్మాణానికి ముందుకు వెళ్తామని తెలిపారు. ఆమె వెంట సెక్టోరియల్‌ అధికారి నూస్రత్‌ అలీ, ఎస్‌వో పల్లవీరెడ్డి, ఆర్‌ఐ రాంరెడ్డి ఉన్నారు.

VIDEOS

logo