ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 28, 2020 , 04:15:50

వైభవంగా అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవం

వైభవంగా అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవం

తాండూరు: తాండూరు పట్టణం అయ్యప్పనగర్‌లో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం 25వ వార్షికోత్సవం శుక్రవారం ఆలయకమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూల పల్లకిలో అయ్యప్పను కాలనీలో భక్తుల ఆటపాటలతో కన్నులపండువగా ఊరేగించారు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వా మి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి భజనలు, పేటతుైళ్లె నృత్యాలు ఆకట్టుకున్నా యి. దీంతో తాండూరు అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. అనంత రం అయ్యప్ప మాలధారణ స్వాములతోపాటు భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భక్తులు పాల్గొని మణికంఠుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు.