ఆదివారం 17 జనవరి 2021
Vikarabad - Nov 28, 2020 , 04:13:54

పనులను పరిశీలించిన డీఆర్‌డీవో పీడీ

పనులను పరిశీలించిన డీఆర్‌డీవో పీడీ

దోమ: గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులలో సమర్ధవంతంగా నిర్మాణాలను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డీఆర్‌డీవో పీడీ కృష్ణన్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నర్సరీ పనులను కృష్ణన్‌ పరిశీలించి పనులలో వేగం పెంచి త్వరగా పూర్తి చేసే లా కృషి చేయాలని ఏపీవో వెంకటేశ్‌కు సూచించారు. అనంతరం దిర్సంపల్లిలో పల్లె ప్రకృతి వనం, మలేపల్లి, అయినాపూర్‌ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి కొనుగోలు కేంద్రాలలో పరిస్థితులను ఐకేపీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదనంతరం శివారెడ్డిపల్లి గ్రామంలో క్రిమిటోరియం పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్‌, ఏపీఎం సాయన్న పాల్గొన్నారు.