శనివారం 23 జనవరి 2021
Vikarabad - Nov 27, 2020 , 04:16:54

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైంది : జిల్లా ఎస్పీ నారాయణ

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైంది : జిల్లా ఎస్పీ నారాయణ

వికారాబాద్‌: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పటిష్టమైందని రా జ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ నారాయణ, సిబ్బందితో కలి సి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో రచించిన రాజ్యాంగం ఆమోదించిన రోజు నవంబర్‌ 26 అని గుర్తు చేశారు. కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడ మే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకుని, రాజ్యాంగం ఇవ్వడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన అందరిని స్మరించుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి రాజు, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటగిరి, ఆర్‌ఐలు, డీపీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

కొడంగల్‌ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయు లు, విద్యార్థులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్‌ కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి యువజన సంఘం అధ్యక్షుడు రమేశ్‌బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ శిరోధార్యమని, ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు దస్తప్ప, లక్ష్మప్ప, శ్రీనివాస్‌, వెంకటయ్య, భవనప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo