మంగళవారం 26 జనవరి 2021
Vikarabad - Nov 26, 2020 , 04:00:15

కొనుగోలు కేంద్రాలతో ‘కనీస మద్దతు ధర’

కొనుగోలు కేంద్రాలతో ‘కనీస మద్దతు ధర’

పెద్దేముల్‌ : రైతులకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు వ్యవసాయపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతో పలు సంక్షే మ, అభివృద్ధి పథకాలను అమలుచేసి వారిని ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌, రబీ సీజనులలో రైతులు సాగు చేసే పంటలకు పెట్టుబడి సాయం పేరుతో రైతుబం ధు పథకాన్ని, వ్యవసాయ భూమి ఉండి దురదృష్టవశాత్తు రైతులు చనిపోతే వారికి రైతుబీమా పథకం ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం, సబ్సిడీపై పంపులు, యంత్రా లు, పంటలకు కావల్సిన క్రిమిసంహారక మందులు, విత్తనాలను అందిస్తున్నారు. అదేవిధంగా రైతులు ఆరుగాలం సాగు చేసి పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర అందించి, రైతులు లాభపడేలా చూస్తున్నారు. ఒకప్పుడు రైతులు పండించిన పంటను దళారులకు, వడ్డీ వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయి మోసపోయేవారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు పొలంలో పండించిన పంటలను విక్రయించడానికి గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల పంటలను కొనేలా చర్యలు చేపట్టి రైతులకు వెసులుబాటు కలిగిస్తున్నారు. 

మండలంలో 15,546ఎకరాల్లో పత్తి , 2,600ఎకరాల్లో వరి పంట సాగు...

మండలంలో ఈ సంవత్సరం 15,546ఎకరాల్లో పత్తి పంటను, 2,600ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మండలంలో సాగుచేసిన పత్తి పంట 15,546ఎకరాల్లో సుమా రు 7,731ఎకరాల వరకు పత్తి పంట పూర్తిగా 50శాతం వరకు దెబ్బతిని పాడైనట్లు ఇప్పటికే వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించి అందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపారు. మండలంలో 1 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం, 5 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేర కు మండలంలోని మొత్తం 6 కొనుగోలు కేంద్రాలను అధికారులు, నేతలు ఇదివరకే ప్రారంభించారు. మండలంలోని మారేపల్లి సమీపంలోను సుమిత్రా కాటన్‌ మిల్‌లో 1 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం, మంబాపూర్‌లో 1, కందనెల్లిలో 1, గాజీపూర్‌లో 1, ఐకేపీ ఆధ్వర్యంలో మన్‌సాన్‌పల్లిలో 1, పెద్దేముల్‌ రైతు సేవా సహకార సంఘంలో 1 మొత్తం 5వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ప్రస్తుతం ప్రతి రోజు కొనుగోలు కేంద్రాలలో తూకాలు, కొనుగోలు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు మారేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో 549మంది రైతుల నుంచి 12వేల క్వింటాళ్ళ 118కిలోల పత్తి పంటను, మంబాపూర్‌ వరి కొనుగోలు కేంద్రంలో 13మంది రైతుల నుంచి 363 క్వింటాళ్ళ వరి పంటను, మన్‌సాన్‌పల్లిలో 10మంది రైతుల నుంచి 324 క్వింటాళ్ళు కొనగా, మిగతా గాజీపూర్‌, కందనెల్లి, పెద్దేముల్‌ కేంద్రాలలో తూకాలు కొనసాగుతున్నాయి.

కొనుగోలు కేంద్రాలతో కనీస మద్దతు ధర...

రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలకు ప్రభుత్వమే కొని రైతన్నలకు సరైన న్యాయం చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,775, వరి పంట గ్రేడ్‌ ‘ఏ’ రకానికి రూ.1,888 చొప్పున, కామన్‌ రకానికి కనీస మద్దతు ధర రూ.1,868చొప్పున అందిస్తుండగా, పంటలో ఉన్న తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరలలో మార్పులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 

దళారుల బాధ తప్పింది...

ఒకప్పుడు పండించిన పత్తి పం టను ఎక్కడ అమ్ముకోవా లో తెలియక దళారుల వద్ద వారు ఇచ్చిన ధరలకు అమ్మి తీవ్రంగా మోసపో యే వాళ్లం. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ గ్రామగ్రామాన అన్ని రకాల పంటలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరను కల్పించి రైతులు పండించిన పంటలను కొనడం తో, మద్దతు ధరతో పాటు, లాభాలను పొందుతు న్నాం. దళారుల బాధ పూర్తిగా తప్పింది - హరిజన్‌ రాంచంద్రి, రైతు, నాగులపల్లి  

సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం...

రైతులను పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధరలను అందించి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మే కొనేలా ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్‌ సార్‌కు రైతుల తరఫున ధన్యవాదాలు. ఒకప్పుడు రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందక అన్నదాతలు నష్టపోయి అనేక ఇబ్బందులుపడేవారు. ప్రస్తుతం ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను కొనడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం. - గిద్ద రాములు, రైతు, మంబాపూర్‌ 
logo