ప్రజాసంక్షేమమే ప్రథమ కర్తవ్యం

- రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
- అన్ని వర్గాలకు పెద్దపీట
- ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు
- ఎమ్మెల్యే కాలె యాదయ్య
- శంకర్‌పల్లిలో 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
- హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
శంకర్పల్లి టౌన్: పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో 26 మందికి మంజూరు చేసిన కలాణ్యలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టంగా భావించాలని, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా బాధ పడకుండా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అవసరాలకు అనుగుణంగా తీసుకువస్తున్నారని తెలిపారు. కరోన కాలంలోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ , కోఆపరేటీవ్ బ్యాంక్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు, తాసిల్దార్ కృష్ణకుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం