ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 24, 2020 , 04:04:49

అభివృద్ధి పనులపై నిరక్ష్యం వద్దు

అభివృద్ధి పనులపై నిరక్ష్యం వద్దు

దోమ: కంపోస్టు షెడ్లు, క్రిమిటోరియంలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీవో పీడీ కృష్ణన్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉపాధిహామీ భవనంలో ఎంపీడీవో జయరాం ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కంపోస్టు షెడ్లను ఈ నెల 26 వరకు, క్రిమిటోరియంలను 30నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది.

 గ్రామ పంచాయతీలలోని నర్సరీ పనులను ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించరాద ని హెచ్చరించారు. దోమ పంచాయతీ నర్సరీలో జరుగుతు న్న పనులను పరిశీలించి పనులలో వేగం పెంచాలని కార్యదర్శి మొగులయ్యకు సూచించారు. కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

VIDEOS

logo