రైతు సంక్షేమమే సర్కార్ ధ్యేయం

- ఏడాదిలో రోడ్లన్నీ బాగు చేస్తాం
- తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
- అట్టహాసంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సోమవారం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ వర్త్య విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డితో పాటు డైరెక్టర్లు పద్మమ్మ, ఆశప్ప, సప్తగిరిగౌడ్, భీంరెడ్డి, మహ్మద్ ఇర్ఫాన్, మాల మల్లప్ప, కట్కం వీరేంద్రస్వామి, దినేశ్‌సింగ్, అలాగే, పాలవర్గంలో సభ్యులుగా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, తాండూరు పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్ తమ పదవులకు దైవసాక్షిగా న్యాయం చేస్తామని ప్రమాణం చేస్తూ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు తాండూరులో భారీ ర్యాలీ నిర్వహించగా, కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. మార్కెట్లో సరైన ధరలు లభించే పంటలను ప్రభుత్వమే నిర్ణయించి రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రైతుల కోసం ప్రత్యేక సమావేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తున్నారని వెల్లడించారు.భూముల అమ్మకాలు, కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చి మండల కేంద్రంలోనే అరగంటలో భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాండూరు వ్యవసాయ మార్కెట్ కోసం త్వరలో భూమిని చూసి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వర్షాలతో పాడైన రోడ్లను ఏడాదిలోగా బాగు చేస్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్‌చైర్మన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవి ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి శాఖ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, టీఆర్ఎస్ సీనియర్ నేతలు పురుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, మహిపాల్‌రెడ్డి, మురళీగౌడ్, నర్సిరెడ్డి, సి.రవిందర్‌రెడ్డి, నయీం, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, గంజ్ వ్యాపారులు, రైతులు, పాలకవర్గం కుంటుంబ సభ్యులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- బర్డ్ ఫ్లూతో భయాందోళనలు వద్దు
- పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక
- ఆండర్సన్ అరుదైన రికార్డు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్‌కు టీకాలు.. భారత్‌ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం