శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 23, 2020 , 04:54:17

పత్తి కొనుగోళ్లు.. ముమ్మరం

పత్తి కొనుగోళ్లు.. ముమ్మరం

  • వికారాబాద్‌ జిల్లాలో  7 కేంద్రాల ద్వారా కొనుగోలు 
  • 2.71లక్షల ఎకరాల్లో పత్తి సాగు
  • ఇప్పటివరకు 3,416 మంది రైతుల నుంచి 70,463 క్వింటాళ్ల పత్తి  సేకరణ 
  • దీని విలువ రూ.41.04కోట్లు
  • నగదు చెల్లించేందుకు అధికారుల చర్యలు 

వికారాబాద్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల ద్వారా   ఈ నెల 9వ తేదీ నుంచి పత్తిని కొనుగోలును ప్రారంభించగా..  ఇప్పటివరకు 3,416 మంది రైతుల నుంచి 70,463 క్వింటాళ్ల పత్తిని  సేకరించారు.  ఈ ఏడాది జిల్లాలో 2.71లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది.  దిగుబడి అధికంగా వస్తుందని ఆశించిన తరుణంలో భారీ వర్షాలకు పంట దెబ్బతిన్నది. ఏకంగా 65వేల ఎకరాల్లో 33శాతం పైగా పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.  అయితే దళారులకు విక్రయించి మరింత నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలకే తరలిస్తుండడంతో రద్దీ పెరిగింది.  కేంద్రాల వద్ద అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.   కొనుగోలు చేసిన పత్తికి నగదు చెల్లించేందుకు  చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటికీ  జిల్లావ్యాప్తంగా 41.04కోట్ల విలువగల పత్తిని కొనుగోలు చేశారు. 

పరిగి: వికారాబాద్‌ జిల్లా పరిధిలో పత్తి కొనుగోలు జోరుగా కొనసాగుతున్నది. ప్రతి రైతు వద్ద నుంచి పత్తి కొనుగోలు చేసేం దుకు సర్కారు ప్రణాళికాబద్ధంగా అవసరమైన  చర్యలు చేప ట్టింది. జిల్లా పరిధిలో సాగు చేయబడిన పత్తి పంట ఈసారి కురి సిన అధిక వర్షాలకు తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. అక్టోబర్‌ నెల లో కురిసిన తెరిపి లేని వర్షాల వల్ల పత్తి పంట పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. అయినప్పటికీ రైతు లు బయట దళారుల చేతులలో మోసపోకుండా నేరుగా సీసీఐ ద్వారా ప్రభుత్వం పత్తి కొనుగోలు చేపడుతుంది. జిల్లా వ్యా ప్తంగా 7 కేంద్రాలలో పత్తి కొనుగోలు చేపడుతున్నారు. ఈనెల 9వ తేదీ నుంచి జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభించారు. ఇప్పటివరకు 70,463 క్వింటాళ్ల పత్తిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు వద్ద నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నారు. 14 రోజుల వ్యవధి లోనే పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు చేయగా రాబోయే రోజులలో మరింత పత్తి కొనుగోలుకు అధికారులు అవసరమైన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. 

    ఈసారి వికారాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 2.71లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. ఈసారి పత్తి పంట దిగుబడి బాగుంటుందని ఆశించిన సంద ర్భంలో ఒక్కసారిగా కురిసిన తెరిపి లేని వర్షాలతో నష్టం చేకూరింది. వరుసగా కురిసిన వర్షాలతో పత్తి పంటకు ప్రధానం గా నష్టం వాటిల్లింది. అక్టోబర్‌ నెలలో కురిసిన వర్షాలకు జిల్లా లో 65వేల ఎకరాలలో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 65 వేల ఎకరాలలో 33శాతం పైగానే పంటనష్టం చేకూరినట్లు అధి కారులు అంచనా వేశారు. పత్తి కాయల ఎదుగుదలపై ఈ ప్రభా వం పడింది. తద్వారా ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాలేదని చెప్పవచ్చు. ప్రతి ఎకరానికి సుమా రు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ముందుగా అధి కారులు అంచనా వేశారు. తెరిపి లేకుండా కురిసిన వర్షాలతో దిగు బడి 7 నుంచి 8 క్వింటాళ్లకు పడిపోయింది. కొన్నిచోట్ల ఇంత కంటే తక్కువ దిగుబడి కూడా వచ్చిందని అధికారులు చెబుతు న్నారు. అధిక వర్షాల వల్లే దిగుబడి తగ్గిపోయింది. ఈ నేప థ్యంలో రైతులను ఆదుకోవడానికి సర్కారు నిర్ణయించి ప్రత్యే కంగా ఏర్పాటుచేసిన కేంద్రాలలో పత్తి కొనుగోలును సీసీఐ ద్వారా చేపడుతుంది. 

వికారాబాద్‌ జిల్లా పరిధిలో 7 కేంద్రాలలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేపడుతున్నారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండల పరిధిలో గల లక్ష్మీ వెంకటేశ్వర జిన్నింగ్‌ మిల్లు, సాయిబాబా జిన్నింగ్‌ మిల్లు, ధరణి జిన్నింగ్‌ మిల్లు, తాండూరు నియోజకవర్గంలోని యాలాల్‌ సమీపంలో గల మారుతి జిన్నింగ్‌ మిల్లు, శుభం జిన్నింగ్‌ మిల్లు, బాలాజీ జిన్నింగ్‌ మిల్లుతోపాటు కోట్‌పల్లి మండల పరిధిలో ఒక కేం ద్రంలో పత్తి కొనుగోలు చేస్తున్నారు. నవంబర్‌ 9వ తేదీ నుంచి జిల్లాలో పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,416 మంది రైతుల వద్ద నుంచి 70,463 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. క్వింటాలు పత్తి రూ.5,825 చొప్పున కొనుగోలు చేయడం జరిగింది. పత్తి కొనుగోలు చేసిన రైతులకు సకాలంలో డబ్బులు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేప ట్టారు. రూ.41.04కోట్ల విలువ చేసే పత్తిని ఇప్పటివరకు సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సీసీఐ అధికారులు నిబంధనలకు అనుగునంగా ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పత్తి రైతుల వద్ద నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అవ సరమైన చర్యలను అధికారులు చేపట్టారు. పత్తిని విక్రయించిన నాలుగైదు రోజుల లోపు రైతులకు డబ్బులు అందే విధంగా అధికారులు వెనువెంటనే చర్యలు చేపడుతున్నారు. పత్తిలో తేమ శాతం, ఇతర నిబంధనలు  పాటిస్తూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇటీవల జిల్లాలో కొత్త గా మూడు జిన్నింగ్‌ మిల్లులు ఏర్పాటు చేశారు. వాటిని సీసీఐ వారు గుర్తింపు ఇస్తే వాటి ద్వారా కూడా పత్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లేనియెడల ప్రస్తుతం ఉన్న కేంద్రాలలోనే పత్తి కొనుగోలు చేపడతారు. 


VIDEOS

logo