శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Nov 22, 2020 , 04:18:06

పరిగి పట్టణాభివృద్ధ్దికి పెద్దపీట

పరిగి పట్టణాభివృద్ధ్దికి పెద్దపీట

పరిగి : పరిగి పట్టణాభివృద్ధ్దికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని అలీహసన్‌ కాలనీలో రూ.5లక్షలతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, అనంత్‌రెడ్డి కాలనీలో రూ.4లక్షలతో మురికికాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి పట్టణ పరిధిలోని అన్ని కాలనీలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్‌ నిధులను అన్ని వార్డుల్లో అత్యం త ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగించాలన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో పరిగి మున్సిపల్‌లో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు మంజూరు చేయించగా రూ.10కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, మిగతా రూ.5కోట్ల పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. 

ప్రధాన రోడ్ల వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంతోపాటు కాలనీలలో అవసరం మేరకు రోడ్ల నిర్మాణాలు చేపడుతామని చెప్పారు. పరిగి పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పరిగి అభివృద్ధి జరుగుతున్నదన్నారు. మున్సిపల్‌ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి సైతం నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి, జడ్పీటీసీ హరిప్రియ, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్‌, కౌన్సిలర్లు కృష్ణ, బద్రుద్దీన్‌, వెంకటేశ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎం.శేఖర్‌, నాయకులు బి.రవికుమార్‌, నరోత్తంరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.