గురువారం 03 డిసెంబర్ 2020
Vikarabad - Nov 22, 2020 , 04:06:45

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

తాండూరు రూరల్‌ : అనుకున్న సమయానికి రైతు వేదికలు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్‌ పౌసుమి బసు అధికారుల, కాంట్రాక్టర్ల, సర్పంచ్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని చెంగోల్‌, బెల్కటూర్‌, కరణ్‌కోట గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను పరిశీలించారు. రైతు వేదికలు ఈ నెల 20లోపు పూర్తి చేయిస్తామని, పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈలు చెప్పారు, కానీ పనులు నెమ్మదిగా సాగడంపై డీఈఈ వెంకట్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20వరకు బెల్కటూర్‌, కరణ్‌కోట రైతు వేదికలు పూర్తవుతాయని చెప్పారని ఇంకా పూర్తికాలేదన్నారు. బెల్కటూర్‌లో ఫ్లోరింగ్‌ అసంపూర్తిగా ఉంది, మరుగుదొడ్ల నిర్మాణాలకు గోడలు నిర్మిస్తున్నారు. ఎప్పుడూ ఫ్లోరింగ్‌ వేస్తారు, ఎప్పడే వైట్‌వాష్‌ చేస్తారని అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. అనుకున్న సమయానికి రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయకపోతే బిల్లులు ఆపేస్తానని, ఆ తర్వాత బిల్లులు రావని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రేపటి లోగా బెల్కటూర్‌, కరణ్‌కోట పనులు పూర్తి చేసి, తనకు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేయకపోతే ఆ యా గ్రామాల సర్పంచ్‌లకు, అధికారులకు షోకాజ్‌ నోటీసుల జారీ చేస్తామని హెచ్చరించారు. పని చేయని చోట కాంట్రాక్టర్లను మార్చాలన్నారు. కరణ్‌కోటలో ఇంకా గోడలకు, ఫ్లోరింగ్‌ పనుల్లో వేగం చేయాలని మేస్త్రీలను స్వయంగా కలెక్టర్‌ చెప్పారు. రాత్రి ఇక్కడే ఉండి పనులు చేయాలని, వారికి భోజన వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో అశోక్‌కుమార్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు మల్లేశ్వరీ, మధన్‌కుమార్‌ ఉన్నారు.

తాండూరు: రైతు వేదిక పనులను వేగవంతం చేయాలని కలెకర్ట్‌ పౌసుమి బసు సూచించారు. నియోజకవర్గంలోని యాలాల మండలంలోని జుంటుపల్లి, అగ్గనూరు, కోకట్‌, తాండూరు మండలంలోని చెంగో ల్‌, బెల్కటూర్‌, కరణ్‌కోట్‌, పెద్దేముల్‌ మండలం ఇందూరులో రైతు వేదిక నిర్మాణం పనులను తనిఖీ చేశారు. తాండూరు, పెద్దేముల్‌ మం డలంలో అసంపూర్తిగా ఉన్న రైతు వేదికల నిర్మాణాలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరులో పునులు ప్రారంభించేంతవరకు అక్కడే కూర్చున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారన్నారు. సమయం వృథా చేయకుండా త్వరలో రైతు వేదికల నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు.