నిరుపేద గుండెలకు భరోసా

పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు,వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు,గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ-ఎయిడ్స్ బాధితులు, బోదకాలు బాధితులకు అందిస్తున్న పింఛన్లు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పింఛ న్లను రెట్టింపు చేసి ప్రతి నెలా వృద్ధులకు, వితంతువులకు రూ.200 నుంచి రూ.1000 రూపాయలు చేయగా, వికలాంగులకు రూ. 1500 పెంచి ప్రతి నెలా అందిస్తున్నది. ఈ పింఛను డబ్బులను అందుకుంటున్న లబ్దిదారులు సీఎం కేసీఆర్‌ని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల భావిస్తూ, ఆ డబ్బులతో లబ్ధిదారులు రోజు వారి ఖర్చుల కొరకు, మందు ల ఖర్చులకు వాడుకుంటున్నారు.
మండలంలో సుమారు 4,443 మందికి
పెద్దేముల్ మండల పరిధిలోని 37 గ్రామ పంచాయతీలలో మొత్తం సుమారు 4,443 మంది తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల పథకం కిందా ప్రతి నెల నెల డబ్బులను అందుకుంటున్నారు. అందులో వృద్ధ్యాప్య పిం ఛన్లు సుమారు 1,250, వితంతు పింఛన్లు 2,467,వికలాంగుల పింఛన్లు 515,ఒంటరి మహిళల పింఛన్లు 205 ,ఇతర పింఛన్ల కింద 6 మంది లబ్ధి పొందుతున్నారు.
సీఎం కేసీఆర్ మా కుటుంబం పాలిట దేవుడు
నా భర్త చనిపోవడంతో వితంతు పింఛను కింద ప్రతి నెలా రూ. 2,016 రూపాయలు వస్తున్నా యి. ఆ డబ్బులను నెలవారి ఖ ర్చులు, మందులకు ఖర్చుపెడు తూ జీవనం కొనసాగిస్తున్నాను. మాలాంటి వితంతువులను సీఎం కేసీఆర్ ప్రతి నెలా పిం ఛను డబ్బులను అందించి మా కుటుంబాల పాలిట దేవునిగా మారాడు. పింఛను డబ్బులతో కుటుంబంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాను. సవారీ బాలమ్మ ,గ్రామం పెద్దేముల్
కుటుంబ అవసరాలకు పింఛను డబ్బు వాడుకొంటున్నా
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛను డబ్బులను నా కుటుం బ అవసరాలకు, నా అవసరాలకు వాడుకుంటున్నా. నాకు పుట్టుకతో రెండు కళ్లు కనపడవు, గత ప్రభుత్వాల హయాంలో నాకు రూ.200 రూపాయల పింఛను వచ్చేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయున అనంతరం ప్రతి నెలా రూ.1500 వచ్చేది. తర్వాత అది పెరిగి రూ.3,016 నెలా వస్తుంది. మా లాంటి పేదల బ్రతుకుల్లో ఆసరా పింఛను పథకంతో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ సార్‌కి మేమంత రుణపడి ఉంటాం... - పాండు, రుద్రారం గ్రామం
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తున్నాం
మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆసరా పింఛన్లకు ధరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తీసుకొని వారి గ్రామంలోనే వివరాలను పూర్తిస్థాయిలో విచారించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నిరుపేద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016, వికలాంగులకు రూ.3016 రూపాయలను అందించడం చాలా సంతోషం. ఇంకా గ్రామాల్లో ఎవరైనా అర్హత కలిగి ఉండి ఆసరా పింఛన్లకు ధరఖాస్తు చేసుకోని వారు ఉంటే వారికి కూడా వీలైనంత త్వరగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తాం. - లక్ష్మప్ప, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పెద్దేముల్ మండలం
తాజావార్తలు
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం