గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 19, 2020 , 03:29:02

చివరి గింజవరకు కొంటాం

చివరి గింజవరకు కొంటాం

  • నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకురావాలి
  • ధాన్యాన్ని నాలుగు రోజులు ఎండబెట్టిన అనంతరమే విక్రయించాలి
  • ఇప్పటి వరకు 62 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 6.4మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌

వికారాబాద్ : జిల్లా రైతాంగం పండించిన ధాన్యంతో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లం నుంచి నేరుగా ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండా నాణ్యత ప్రమాణాల ప్రకా రం ఎండబెట్టి, పరిశుభ్రపర్చి, తేమశాతం 17శాతంకు తగ్గకుం డా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. జిల్లాలో మొత్తం 123వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు. ఐకేపీ 40, పీఏసీఎస్‌ 51, డీసీఎంఎస్‌ 27, ఏఎంసీ 5 కేంద్రాలు కాగా ఇప్పటివరకు 62 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించబడి వరిధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు. బయటి ప్రాంతాల నుంచి వరి ధాన్యం రాకుండా జిల్లా సరిహద్దులో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఇబ్బందులు పడకుండా మండలానికి ఒక టీం కూడా ఏర్పాటు చేయడంతోపాటు టాస్క్‌ఫోర్స్‌ టీంను కూడా ఏర్పాటు చేసినట్లు మోతీలాల్‌ తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు జారీ చేసే టోకెన్ల ప్రకారం రైతుల నుంచి ధాన్యం, పత్తి కొనుగో లు చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాతే మిల్లుకు తరలించాలన్నారు. తేమ, ఇతర నాణ్యత ప్రమాణాల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. 

జిల్లాలో ఏడు పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు 7 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేస్తున్నట్లు మోతీలాల్‌ తెలిపారు. జిల్లాలో 12 మక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1850 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సివిల్‌ సైప్లె డీఎం విమల తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo