పరిగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పరిగి : రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేపడుతామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పరిగిలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సర్కారు నిర్ణయించిందన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. వానకాలం వరి ధాన్యం కొనుగోలుకు సైతం అవసరమైన అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడరాదని, ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలుకు సర్కారు బాధ్యత తీసుకుందన్నారు. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంతోపాటు సకాలంలో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుందని తెలిపారు. మార్కెట్ కమిటీల ద్వారా సైతం కొనుగోళ్లకు సర్కారు చర్యలు చేపట్టిందని, తద్వారా వాటి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి.అజహరుద్దీన్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కుమార్, మలిపెద్ది ప్రభాకర్గుస్తా, బి.రవికుమార్, కౌన్సిలర్ ఎదిరె క్రిష్ణ, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, రైతు సంఘం నాయకుడు బాబయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?