వికారాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 8,97,255

- ఈ నెల 21, 22, డిసెంబర్ 5, 6 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
- జనవరి 15న తుది జాబితా విడుదల
వికారాబాద్ : ఓటరుగా నమో దు చేసుకునేందుకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఎవరైతే అర్హులైన వారు ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ceotelangana.in, http://nvsp.in/ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకొని తప్పులను సరిచేయించుకోవచ్చు. ఓటు హక్కులేని 18 ఏళ్లు నిండిన యువ తీ, యువకులు ప్రతీ ఒక్కరూ ఆన్లైన్ లేదా మీ సేవా ద్వారా ఓటరు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తోపాటు ఫారం-6లో వివరాలను రాసి సంబంధిత మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలోగానీ, బూత్‌స్థాయి అధికారులకుగానీ అందజేయవచ్చు . ఓటరు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకుగాను పదో తరగతి మార్కుల మెమోతోపాటు అడ్రస్‌ప్రూఫ్ తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. మరణించిన లేదా శాశ్వతంగా నివాసం మార్చిన వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించుటకుగాను ఫా రం-7 పూరించి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో మీ పేరు సవరించుకునేందుకు ఫారం-8లో మీ ఈపీఐసీ నెంబర్‌ను పేర్కొంటూ క్లెయిమ్ పత్రాన్ని దాఖలు చేయాలి. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసం మార్చుకున్నట్లయితే ఫారం-8ఏ లో పాత చిరునామాతోపాటు ప్రస్తుత చిరునామాను పేర్కొంటూ సవరణ పత్రాన్ని ఆన్‌లైన్‌తోపాటు నేరుగా సంబంధిత బీఎల్వోలకు అందజేయవచ్చు. నివాసాన్ని కొత్త నియోజకవర్గంలోకి మార్చుకున్నట్లయితే మళ్లీ తాజాగా ఫారం-6 దాఖలు చేసి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,97,255 మంది ఓటర్లుండగా, పురుషులు-4,48,787 మంది, మహిళలు-4,47,967 మంది ఉన్నారు. ఇతరులు-23 మంది , సర్వీసు ఓటర్లు-478 మంది ఉన్నారు. అయితే తాండూర్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,38,897 మంది ఓటర్లుండగా పురుషులు-1,21,527 మంది, మహిళలు-1,17,138 మంది ఉన్నారు. ఇతరులు 5 మంది, సర్వీసు ఓటర్లు-227 మంది ఉన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,22,835 మంది ఉండగా పురుషులు-1,12,598 మంది మహిళలు-1,10,164 మంది ఉన్నారు. ఇతరులు-3, సర్వీసు ఓటర్లు-70 మంది ఉన్నారు. తాండూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,19,711 మంది ఉండగా పురుషులు-1,07,412 మంది మహిళలు-1,12,246 మంది ఉన్నారు. ఇతరులు-9 మంది, సర్వీసు ఓటర్లు-44 మంది ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,812 మంది ఉండగా పురుషులు-1,07,250 మంది, మహిళలు-1,08,419 మంది ఉన్నారు. ఇతరులు ఆరుగురు, సర్వీసు ఓటర్లు-137 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 1130కి పోలింగ్ కేంద్రాలుండగా, పరిగి నియోజకవర్గంలో 305 , వికారాబాద్ నియోజకవర్గంలో 284 , తాండూర్ నియోజకవర్గంలో గతం లో 262 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రస్తుతం 266 పోలింగ్ కేంద్రాలు, కొడంగల్ నియోజకవర్గంలో 275 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
తాజావార్తలు
- తమిళ ప్రజలపై మోదీకి గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- క్యాపిటల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్‌గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్