బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Nov 16, 2020 , 03:54:12

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి

ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గంలోని పంచాయతీలు, తండాల అభివృద్ధికి నిధులు మంజురూ చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు శనివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వినతి పత్రం అందజేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆమె నివాసంలో ఎమ్మెల్సీ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాలు, తండాల ల్లో మౌలిక వసతులు, నూతన రోడ్లు కోసం నిధులు మంజురూ చేయాలని  విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి నిధు లు మంజూరుకు కృషి చేస్తానని హామీనిచ్చినట్లు తెలిపారు.  అంతకు ముందుకు ఎమ్మెల్సీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

VIDEOS

logo