ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Nov 16, 2020 , 03:48:49

ఆస్తిపన్ను కట్టు రాయితీ పట్టు

ఆస్తిపన్ను కట్టు రాయితీ పట్టు

  • మున్సిపాలిటీల్లో రూ.10 వేలలోపు ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ
  • వికారాబాద్‌ జిల్లాలో 80శాతం మందికి లబ్ధి
  • ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది వర్తింపు
  • పేదలకు అండగా సీఎం కేసీఆర్‌
  • సంక్షోభంలోనూ  సంక్షేమ పథకాల అమలు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
  • హర్షం వ్యక్తం చేస్తున్న మున్సిపాలిటీల ప్రజలు
దివాళి పటాకా.. గరీబ్‌కు మిల్‌గయా  ధమాకా.. అన్న చందంగా మున్సిపాలిటీల్లో రూ. రూ.10 వేలలోపు ఆస్తిపన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అందుకనుణంగా 24 గంటల్లోనే  పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పని తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. వికారాబాద్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సుమారుగా రూ.9 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉండగా,  దాదాపు రూ.3 కోట్ల వరకు ఖజానాకు చేరింది. తాజాగా సర్కార్‌ ప్రకటనతో పట్టణాల్లోని 80శాతం పేద కుటుంబాల్లో మరిన్ని వెలుగులు నిండనున్నాయి.  ఆస్తి పన్ను చెల్లించలేక ఆర్థిక భారంతో  ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.      -  పరిగి

కష్టకాలంలో గొప్ప నిర్ణయం

కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, వరదల సంక్షోభం లో పేద, మధ్య తరగతి ప్రజలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో రూ.15వేల లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న మధ్య తరగతి ప్రజలకు 50 శాతం రాయితీ ఇవ్వడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీలో 13.72 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. మున్సిపాలిటీల్లోనూ రూ. 10 వేల వరకు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. - సబితారెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి
పరిగి: దీపావళి పండుగవేళ టీఆర్‌ఎస్‌ సర్కారు పేదలకు మరో వరం ప్రక టించింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుం బానికి ఏదో ఒక పథకం ద్వారా సర్కార్‌ లబ్ధి చేకూరుస్తున్నది. దీపావళి పం డుగ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.15వేల లోపు, రాష్ట్రంలోని పట్టణాలు(మున్సిపాలిటీలు)లో రూ.10వేల లోపు ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ప్రకటన పేద కుటుంబాలలో మరిన్ని వెలుగులు విరజిమ్మిందని చెప్పవచ్చు. కేవలం ప్రకటన చేయడం వరకే కా కుండా అందుకు తగ్గట్లుగా 24 గంటల వ్యవధిలోనే సంబంధిత నిర్ణయానికి అనుగుణంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పింది చేసి తీరుతుందని మరోసారి నిరూపితమైంది. వికారాబాద్‌ జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, సర్కారు ప్రకటించిన ఆస్తిపన్ను రాయితీతో వేలాది కుటుంబాలు లబ్ధి పొం దనున్నాయి. 10వేల రూపాయల లోపు ఆస్తిపన్ను గల కుటుంబాల వివరా లను అధికారులు ప్రత్యేకంగా సేకరి స్తున్నారు. తమ వద్ద గల రికార్డుల ఆధా రంగా వాటి సేకరణ జరుగుతుంది. 
సాధారణంగా గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ఆస్తి పన్ను ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటికే నూతన మున్సిపాలిటీలుగా ఏర్పడిన పట్ట ణాలలో పన్నులను ఒక సంవత్సరం పాటు యథాతథంగా, గతంలో ఉన్న మేరకు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. తాజాగా అన్ని మున్సిపాలిటీలలోను రూ.10వేల లోపు ఆస్తి పన్ను చెల్లింపు చేసే వారికి 50శాతం రాయితీ ప్రకటన ద్వారా పేదలకు మేలు జరుగనున్నది. వికారాబాద్‌ జిల్లా పరిధిలో  నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. పరిగి మున్సిపాలిటీ పరిధిలో 5,017 ఇండ్లు ఉండగా పాత బకాయిలతో కలిసి రూ.1.49కోట్లు డిమాండ్‌గా ఉంది. అందులో పాత బకాయిలు రూ.95.76లక్షలు ఉన్నాయి. అన్ని కలిపి ఇప్పటి వరకు రూ.34.24లక్షలు ఆస్తిపన్ను వసూలు చేశారు. తాండూరు మున్సి పాలిటీలో మొత్తం ఇండ్లు 13,150 ఉండగా, ఆస్తి పన్ను రూ. 3.13కోట్లకు గాను ఇప్పటివరకు రూ.1.58లక్షలు వసూలు చేశారు. కొడంగల్‌ మున్సిపా లిటీలో మొత్తం ఇండ్లు 3,827 ఉండగా ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.23.49 లక్షలకు ఇప్పటివరకు రూ.12.39లక్షలు వసూలు చేశారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం ఇండ్లు 13,360 ఉండగా ఆస్తి పన్ను రూ. 3.14 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1.90కోట్లు వసూలు చేశారు. 
వికారాబాద్‌ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో రూ.10వేల లోపు ఆస్తిపన్ను చెల్లించేవారు సుమారు 80శాతం వరకు ఉంటారు. వ్యాపార కేంద్రమైన తాండూరు, జిల్లా కేంద్రమైన వికారాబాద్‌తోపాటు నూతనంగా ఏర్పడిన పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కొంత అధిక మొత్తంలో ఆస్తి పన్నులు చెల్లిస్తుం టాయి. కేవలం గృహాలకు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపులోనే ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. తద్వారా గృహాలకు సంబంధించి చాలా తక్కువ సంఖ్యలోనే రూ.10వేల పైగా ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉంటారు.  చెల్లిం చాల్సిన వారికి ఇది ఉపయోగకరంగా ఉండగా, ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి వచ్చే సంవత్సరం ఈ రాయితీ ప్రకటించడం ద్వారా అందరికీ ఉపయోగకరంగా మారుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న రాయితీ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.      

పేద ప్రజలకు వరం...

రూ.10 వేల లోపు ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించడం చాలా చక్కటి నిర్ణయం. కేవలం ప్రకటన వరకే కాకుండా ఇందుకు సంబం ధించి 24 గంటల్లోనే పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడడం ద్వారా సర్కారుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది. ప్రస్తుత సమయంలో ఆస్తిపన్ను రాయితీ ప్రకటన పేద ప్రజలకు ఒక వరంగా మారుతుంది. -ముకుంద అశోక్‌, చైర్మన్‌, పరిగి మున్సిపాలిటీ

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి

ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం 50శాతం రాయితీ ప్రకటన పేదలకు మేలు చే కూ ర్చేది. పట్టణాలలోని పేదలకు ఇది ఎంతో ఊరట ఇచ్చే నిర్ణయం. ప్రస్తుత కరోనా సమయంలో పన్నుల చెల్లింపు కొంత ఇబ్బంది కరం. ఇలాంటి పరిస్థితిలో సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ నిర్ణయం ద్వారా సీఎం కేసీఆర్‌ మరోసారి పేదల పక్షపాతిగా నిలిచారు. ఆస్తిపన్ను రాయితీ ప్రకటించిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు.  -పర్శమోని అనంతయ్య, పరిగి


VIDEOS

logo