బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 14, 2020 , 03:47:53

పాఠశాలకు మరమ్మతులు చేయిస్తాం

పాఠశాలకు మరమ్మతులు చేయిస్తాం

బొంరాస్‌పేట : మండలంలోని దుద్యాల ప్రాథమిక పాఠశాలకు మరమ్మతులు చేయిస్తామని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల పాఠశాల పైకప్పు నుంచి సిమెంటు పెచ్చులు ఊడిపడ్డాయి.  పాఠశాల దుస్థితి గురించి హెచ్‌ఎం కిష్టయ్య, గ్రామస్తులు శుక్రవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే స్పందించారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి మరమ్మతులు చేయించాలని సర్పంచ్‌ మహ్మద్‌ ఖాజాను ఆదేశించారు. అంతకుముందు మండలంలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన దాబాను ఎమ్మెల్యే ప్రారంభించారు.


VIDEOS

logo