శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 13, 2020 , 04:04:59

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు

పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు

మోమిన్‌పేట:గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చూపొద్దని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. కేసారం గ్రామంలో గురువారం రైతు వేదిక, కంపోస్ట్‌ షెడ్‌, శ్మశానవాటిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని  సూచించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని అనంతగిరి రైతు కూరగాయల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశంలో ఆమె అలుగడ్డ విత్తనం రైతులందరికీ అందుబాటులో ఉంటుందా లేదా అని ఆరా తీసారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్‌, ఎంపీడీవో శైలజా రెడ్డి, ఏఈ నయనశ్రీ, సెర్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo