ఆగ్రోస్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

పూడూరు : రైతులు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సబ్సిడీపై అందజేసే విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చన్గోముల్ గ్రామంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా కొత్త చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ప్రతి మండలంలో క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మించి, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, ఎండీ అజీం, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అజారుద్దీన్, సర్పంచ్ కడప మల్లికధనుంజయ్య, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, ప్రభాకర్‌గుప్తా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రహీంఖాన్, సర్పంచ్‌లు గోపాల్, పాపయ్య, శేఖర్‌గౌడ్, ధనుంజయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు