శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 13, 2020 , 03:40:11

భార్గవి... బాగా చదువాలి

భార్గవి... బాగా చదువాలి

తాండూరు: ఇటీవల విడుదలైన ఐసీఏఆర్‌ ఫలితాల్లో  తాండూరుకు చెందిన రవీందర్‌, సువర్ణ దంపతుల కూతురు భార్గవి జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో  గురువారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి భార్గవికి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించావన్నారు. బాగా చదివి మన జిల్లాకు కలెక్టరమ్మవు కావాలన్నారు. ఉన్నత విద్య ఎంత చదువుతానంటే అంత చదువు. అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

VIDEOS

logo