శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 12, 2020 , 04:45:53

చలి @ 7.1

 చలి @ 7.1

వికారాబాద్‌ : అసలే కరోనా కాలం మహమ్మారి రెండో విడుత పడగ విప్పనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం ప్రారంభం నుంచే వణికిస్తోంది. వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. చలి పెరుగడంతో వ్యాధులు సైతం విజృంభిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

చలికాలం ప్రారంభంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం మర్పల్లి మండలంలో కనిష్ఠంగా 7.1 సెల్సియస్‌ డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా పగటి పూట ఎండలు కొడుతూ సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటునప్పటికీ రాత్రి 7 గంటల నుంచి చలి ప్రారంభవుతున్నది. ఉదయం 8 గంటల వరకు కూడా చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా మార్నింగ్‌ వాకర్స్‌ తమ వ్యాయామాన్ని సాయంత్రానికి మార్చుకుంటున్నారు. చలి ఉన్నా బయటకు రాక తప్పనివారు చల్లగాలుల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తత

ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయి చలి తీవ్రత కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. చలికాలంలో నిమోనియా, డెంగ్యూ, స్వైన్‌ప్లూ, చర్మ వ్యాధుల బారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. చలిగాలులు సోకడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు జ్వరం ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ్ద చేయకుండా వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. 


VIDEOS

logo