ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 11, 2020 , 04:24:11

మహిళా రైతులకు చేయూత

మహిళా రైతులకు చేయూత

  • రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వృద్ధి సాధించాలి
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
  • కులకచర్లలో ఏరువాక రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రారంభం
  • పాల్గొన్న కలెక్టర్‌ పౌసుమిబసు 
కులకచర్ల: వ్యవసాయాన్ని  పండుగ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంవివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేం ద్రంలో శ్రీరామలింగేశ్వర ఏరువాక మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వికారాబాద్‌ జిల్లాలోనే రెండు మండలాలను ఎంపిక చేసి మోమిన్‌పేట్‌, కులకచర్ల మండలాల్లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పా టు చేయడం అభినందనీయమని అన్నారు. కులకచర్ల మండలంలో 27లక్షలతో వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసి రైతులకు తక్కువ ధరలకే కిరాయిలకు ఇస్తున్నారన్నారు. గ్రామాల్లో మహిళా రైతు ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ద్వారా 52లక్షల రూపాయలు మంజూరు కాగా వాటికి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేశారని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం అభివృద్ధికి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, గ్రామాల ప్రజా ప్రతినిధులు, సెర్ఫ్‌ సిబ్బంది కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు మహిళా ఉత్పత్తిదారుల సంఘం ద్వారా చేయూతనందించేందుకు ఎఫ్‌పీవో ద్వారా వ్యవసాయ పరికరాలను అద్దెకు అందజేయాలని అన్నారు. వచ్చిన వ్యవసాయ పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా ఉత్పత్తిదారుల సంఘం లాభసాటిగా తయారవుతుందని తెలిపారు. నెల రోజుల్లో 60వేల ఆదాయాన్ని సంపాధించడం మంచి పరిణామమని అన్నారు. మండలంలో ఎక్కువగా సిరిదాన్యాలను ఉత్పత్తిచేస్తున్నారని వాటిని ప్రాసెసింగ్‌ చేసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయని అన్నారు. కులకచర్ల మండలంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తే వాటికి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళారైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఫర్టిలైజర్‌, సీడ్స్‌ విత్తనాలు కూడా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎఫ్‌పీవోకు కులకచర్లలో 500గజాల స్థలాన్ని కేటాయించాలని సర్పం చ్‌ సౌమ్యారెడ్డికి సూచించారు. రైతులకు ఎక్కువగా అవసరమయ్యే హార్వెస్టర్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని అవసరమైతే స్త్రీ నిధి ద్వారా గాని బ్యాంక్‌లోను ద్వారా గాని కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.  కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, డీఆర్డీవో కృష్ణన్‌, కులకచర్ల ఎంపీటీసీ ఆనం దం, ఎంపీడీవో కాలూసింగ్‌, మహిళా ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ఏడీవో వీరప్ప, కులకచర్ల ఏవో వీరస్వామి, ఏపీఎం శోభ, టీఆర్‌ఎస్‌ నాయకులు హరికృష్ణ, వెంకటయ్యగౌడ్‌, సెర్ప్‌ డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం శివ, మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo