గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 10, 2020 , 03:18:41

వికారాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో చలి

వికారాబాద్‌ జిల్లాలో రికార్డు  స్థాయిలో చలి

తాండూరు:  వికారాబాద్‌ జిల్లాలో సోమవారం చలి రికార్డు స్థాయిలో 8.4 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు తే మ గాలులు వీయడంతో పగటిపూట పొడి వాతావరణం ఉంటుంది. రాత్రి వేళలో ఉష్ణో గ్రతలు పడిపోవడంతో చలి విజృంభనతో ప్రజలు బయటకి రావాలంటే వెనుకాడుతున్నారు. నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో తాండూరు పట్టణానికి ఉపాధి పనుల నిమిత్తం కూలీలు వస్తుంటారు. వీరందరు ఉదయం 8 గంటల వరకే తాండూరు పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి తాము రోజు నిర్వహించే పనులకు వెళుతుంటారు. అయితే చలి కారణంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పట్టణానికి చేరుకొనే ఈ కార్మికులు ఆలస్యంగా వస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తరువాతే వీరు ఉపాధి పనులకు వెలుతున్నారు.  సోమవారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 8.4 నమోదై రికార్డు స్థాయికి చేరుకుంది. చలిప్రభావం అధికమవడంతో సాయంత్రం 5 గంటల నుంచే చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు మంటలు కాపడం, ఉన్ని దుస్తులు ధరించడం కనిపిస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

VIDEOS

logo