శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 07, 2020 , 04:12:46

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

  • ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల వెల్లువ
  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో  స్వీకరణ 
  • రంగారెడ్డి జిల్లాలో 1,34,992, వికారాబాద్‌ జిల్లాలో 24,591
  • శుక్రవారం అర్ధరాత్రి వరకు అవకాశం.. పెరగనున్న సంఖ్య 
  • డిసెంబర్‌ 1న ముసాయిదా..  జనవరి 18న తుది జాబితా

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.   శుక్రవారం అర్ధరాత్రితో గడువు ముగిసింది.  అయితే సాయంత్రం వరకు రంగారెడ్డి జిల్లాలో 1,34,992 దరఖాస్తులు అందగా,  వికారాబాద్‌ జిల్లాలో 24,591 వచ్చాయి.  అర్ధరాత్రి వరకు సమయం ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరగనున్నది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో ఓటరు నమోదుకు అధికారులు అవకాశం కల్పించారు.  డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదా జాబితా, జనవరి 18న తుది జాబితాను విడుదల చేయనున్నారు. 

వికారాబాద్‌/ రంగారెడ్డి నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.  ఆన్‌లైన్‌, నేరుగా తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులను అందజేశారు. తాసిల్దార్‌ కార్యాలయాల ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరమే సంబంధిత ఓటరు నమో దు దరఖాస్తులకు ఆమోదం తెలుపుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి దరఖాస్తులకు సంబంధించి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డిసెంబర్‌ 1న ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేయనున్నారు. అదేవిధంగా డిసెంబర్‌ 31 వరకు ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 12, 2021 వరకు అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. జనవరి 18న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. 

ఉమ్మడి జిల్లాలో  1,59, 583 మంది దరఖాస్తు

 వికారాబాద్‌ జిల్లాలో 24,591 మంది, రంగారెడ్డి జిల్లాలో 1,34,992 మంది ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

వికారాబాద్‌ జిల్లా మండలాల వారీగా వివరాలు

బంట్వారం మండలంలో 461, ధారూర్‌లో 919, దోమ మండలంలో 1080, కోట్‌పల్లి మండలంలో 292, కుల్కచర్ల మండలంలో 1555, మర్పల్లి మండలంలో 844, మోమిన్‌పేట్‌ మండలంలో 974, నవాబుపేట్‌ మండలంలో 1144, పరిగిలో 2802, పూడూర్‌ మం డలంలో 1370, వికారాబాద్‌లో 5001, బషీరాబాద్‌లో 585, బొంరాసుపేట్‌ మండలంలో 947, దౌల్తాబాద్‌లో 627, కొడంగల్‌ మండలంలో 921, పెద్దేముల్‌ 666, తాండూర్‌ మండలంలో 3637, యాలాల మండలంలో 766 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా..

మండలాల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి మండలాల వారీగా ఇలా ఉన్నాయి. అబ్దూల్లాపూర్‌మెట్‌ 6417,ఆమనగల్లు1572, బాలాపూర్‌ 12,752, చేవెళ్ల 2845, చౌదరిగూడ 619, ఫరూఖ్‌నగర్‌ 4700, గండిపేట 3789, హయత్‌నగర్‌ 11, 652, ఇబ్రహీంపట్నం 5073, కడ్తాల్‌ 970, కందుకూరు 2051, కేశంపేట 1368, కొందుర్గు 900, కొత్తూరు 990, మాడ్గుల 1501, మహేశ్వరం 3333, మంచాల 2329, మొయినాబాద్‌ 1841, నందిగామ 801,రాజేంద్రనగర్‌ 8379, సరూర్‌నగర్‌ 30,016, శేరిలింగంపల్లి 20,121, షాబాద్‌ 1437, శంషాబాద్‌ 3869, శంకర్‌పల్లి 2071, తలకొండపల్లి 1374,యాచారం 2222 మంది దరఖాస్తు చేసుకున్నారు.VIDEOS

logo