ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 07, 2020 , 03:51:50

అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలి

అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలి

  • వారంలో ఇంకుడు గుంతలు నిర్మించాలి
  • రెండుమూడు రోజుల్లో రైతువేదికల పనులు పూర్తి చేయాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు 
  • పెద్దేముల్‌ మండలం గోపాల్‌పూర్‌లో పర్యటన

పెద్దేముల్‌: వారం రోజుల్లో గోపాల్‌పూర్‌ గ్రామంలో అన్ని ఇం కుడు గుంతల నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని గోపాల్‌పూర్‌,పెద్దేముల్‌ గ్రామాల్లో పర్యటించి మురుగుకాల్వలు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ప్రధాన రోడ్లు, నీటి తొట్టెలు  పరిశీలించారు. అనంతరం గ్రామ శివా రులో నిర్మాణంలో ఉన్న రైతువేదిక నిర్మాణాలను పరిశీలించి, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను సం బంధిత ఏజెన్సీలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను ఒక ప్రణా ళిక ప్రకారం చేపట్టాలన్నారు. 

ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రతి ఒక్కరు నిర్మించుకొనేలా అధికారులు చర్య లు తీసుకోవాలని అన్నారు. గోపాల్‌పూర్‌ గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని పనుల వివరాలను రిజిష్టర్‌ లలో నమోదు చేయాలని, గ్రీన్‌ఫండ్‌ ఎంత ఉంది? ఎంత ఖర్చు పెట్టారు? వన నర్సరీ ఎ లా ఉంది? మురుగుకాల్వలకు ఐరన్‌ జాలీల ఏర్పాటు చేశారా? అనే విషయాలను అడిగి తెలుసుకొని అన్ని అంశాల సమాచా రం గ్రామ పంచాయతీలో పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

పెద్దేముల్‌, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు ఆదేశించారు. అంతకు ముందు విద్యుత్‌ ఏఈని పిలిపించి  ఇంకా కరెంట్‌ కనెక్షన్‌ ఎందుకు  ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో గ్రామా ల్లో అన్ని పనులను ఛాలెంజ్‌గా తీసుకొని త్వరగా పూర్తి చే యాలని, ఈనెలాఖరు వరకు మళ్లీ ఒకసారి గ్రామానికి వస్తానని అప్పటి వరకు అన్ని పనులు పూర్తి చేయాలని  లేకుంటే  చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు విజయమ్మ, రాములు, పెద్దేముల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ద్యావరివిష్ణువర్ధన్‌ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్‌, డీఎల్పీవో చంద్రశేఖర్‌,ఎంపీడీవో  పవన్‌కుమార్‌,ఎంపీవో సుష్మా, పంచా యతీ కార్యదర్శి కార్తీక్‌, ఆయా శాఖల ఏఈలు సందీప్‌, అఖిల్‌, ప్రతిభ, సిద్దార్థ, ఆర్‌ఐ రాజురెడ్డి, ఈసీ కృష్ణ, ఏపీఎం బాలయ్య పాల్గొన్నారు.


VIDEOS

logo