బుధవారం 24 ఫిబ్రవరి 2021
Vikarabad - Nov 06, 2020 , 03:41:50

నిరుపేదలకు కొండంత అండ : ఎమ్మెల్యే ఆనంద్‌

నిరుపేదలకు కొండంత అండ : ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు నిరుపేదలకు కొండంత అండగా నిలిచాయని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ భవనంలో వికారాబాద్‌ మండలం, పట్టణానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల వివాహాలు చేస్తే అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ పథకం  నిరుపేదల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ పథకాలు వచ్చినప్పటి నుంచి బాల్యవివాహాలు కూడా తగ్గాయన్నారు. కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల పేదలకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo