ప్రతి రైతు నుంచి కొనుగోళ్లు

- రైతులు అధైర్యపడొద్దు
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
- మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, పరికరాలు అందజేత
పరిగి : రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రతి రైతు వద్ద నుంచి వరి ధాన్యం, మక్కజొన్నలు కొనుగోలు చేస్తామని పరిగి ఎ మ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం మక్కజొన్నలు కొనుగోలు చేస్తుందన్నారు. మక్కజొన్నల కొనుగోలుతో ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని, రైతుల కోసం ఈ నష్టం భరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. గత యాసంగిలో వలె ఈసారి కూడా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏ ర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోళ్లకు సర్కారు శ్రీకారం చు ట్టనుందని చెప్పారు. ఈ నెల రెండో వారంలోనే ప్రతి గ్రా మంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నా హాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ప్రైవేటు వారికి విక్రయించరాదని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మంచి ధర పొందా లని ఎమ్మెల్యే సూచించారు. అత్యంత పారదర్శక విధానం లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులకు ఎల్లపుడూ టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుసున్నదని ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు. ఈ సందర్భంగా పరిగి మండలం మిట్టకోడూర్‌లో ఏర్పాటు చేసిన నూతన ఫర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు.
మత్స్యకారుల కుటుంబాలకు సర్కారు అండ
మత్స్యకారుల కుటుంబాలకు సర్కారు అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టులో ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేసిన లక్షా 75వేల చేప పిల్లలను ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లఖ్నాపూర్ ప్రాజెక్టులో రెండు విడుతల్లో 2. 67లక్షల చేప పిల్లలు వదిలిపెట్టామన్నారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నదన్నా రు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, ఇతర పరికరా ల పంపిణీతో అండగా నిలుస్తుందన్నారు. రూ.8కోట్లతో ల ఖ్నాపూర్ ప్రాజెక్టు పునరుద్ధరణ, మినీ ట్యాంక్‌బండ్ నిర్మా ణం చేపట్టడంతో ఏడాది పొడవునా మత్స్యకారులకు ఉపా ధి కలిగించే విధంగా చేపల పెంపకానికి అనువుగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియో గం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు.
పీఎంజేజేవై కింద రూ.2లక్షలు చెక్కు అందజేత
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద లబ్ధిదా రు పాత్లావత్ గోపాల్‌కు రూ.2లక్షల చెక్కును బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగిలో అందజేశారు. ప్రతి ఒక్కరూ ఈ బీమా చేయించాలని ఎమ్మెల్యే సూచించా రు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు బీమాకు సం వత్సరానికి రూ.330 చెల్లించాలని అన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మత్స్యశాఖ ఏడీ దుర్గాప్రసాద్, ఏడీఏ వీరప్ప, బ్యాం క్ మేనేజర్ నాగయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షు లు ఆంజనేయులు, సంతోష్‌కుమార్, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, పీఏసీఎస్ డైరెక్టర్లు ఈశ్వరప్ప, భోజ్యానాయక్, హన్మంత్‌రెడ్డి, సీఈవో అమరేందర్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, సురేందర్‌కుమార్, గోపాల్, షోండేపూర్ సర్పంచ్ అపర్ణ, మత్స్యకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భిక్షపతి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!