ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

వికారాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పౌసుమిబసు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ప్రభుత్వ పథకాల అమలుతీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్, కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి వరకు చేరేలా సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ అధికారులు సమీక్షా సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూ చించారు. బంట్వారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు గ్రామ స్థాయి వరకు చేరడం లేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా అందించే పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, డీటీడీవో కోటాజి, డీసీఎస్వో రాజేశ్వర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
- దుస్తులపై అసభ్యంగా ప్రవర్తిస్తే లైంగిక వేధింపు కాదు
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
- పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ల ఆవిష్కరణ
- కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
- ఏపీలో కొత్తగా 56 మందికి కరోనా
- మిలీషియా సభ్యుల ఆరెస్టు
- ‘క్రాక్’ 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే