శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 31, 2020 , 03:58:55

కలెక్టరేట్‌ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

కలెక్టరేట్‌ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్‌: కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆనంద్‌ కాం ట్రాక్టర్లకు సూచించారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్‌ కార్యా లయ భవనాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం ద్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌ భవనాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికా రులు, కాంట్రక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచిం చారు. భవన నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన ఇటుక, స్టీల్‌, సిమెంట్‌ ఉపయోగించాలని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పాండు, మండల పార్టీ అధ్యక్షుడు కమా ల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.