శనివారం 28 నవంబర్ 2020
Vikarabad - Oct 31, 2020 , 03:46:28

బోనం ఎత్తిన జడ్పీచైర్‌పర్సన్‌ .. ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు

బోనం ఎత్తిన  జడ్పీచైర్‌పర్సన్‌ .. ఘనంగా ప్రతిష్ఠాపనోత్సవాలు

పెద్దేముల్‌ : పోచమ్మ తల్లి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని వికారాబాద్‌  జిల్లా జడ్పీచైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మారెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాలు తదితర కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి మెలసి ఉండాలని అన్నారు. మారెపల్లి గ్రామంలో గతంలో జిల్లా పరిషత్‌ నిధులతో  పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మున్ముందు   మరిన్ని నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేస్తామ న్నారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం  కట్టుబడి ఉందన్నారు. అదే విధంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మారెపల్లి సర్పంచ్‌ బల్వంత్‌ రెడ్డి  గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా  మాస్కులు ధరించాలని,శానిటైజర్లను తరుచూ వాడి మహమ్మారి బారిన పడకుండా  జాగ్ర త్తపడాలన్నారు.అంతకు ముందు గ్రామ మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. నవభారత్‌ సుద్ద కంపెనీ ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు సుమారు 200 మందికి చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, టీఎల్‌డీఏ చైర్మెన్‌ నారాయణ రెడ్డి,తట్టేపల్లి పీఏసీఎస్‌ చైర్మెన్‌ లక్ష్మారెడ్డి, పెద్దేముల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మెన్‌ ద్యావరి విష్ణువర్ధన్‌ రెడ్డి, మారెపల్లి సర్పంచ్‌ పట్లోళ్ళ బల్వంత్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ లక్ష్మీ,వార్డు సభ్యులు, మండల పార్టీ మాజీ  అధ్యక్షుడు డీవై నర్సిం హులు, ఆరెమైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ భూపతి ప్రతాప్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, వెంకటేశ్‌ చారి, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.