సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Oct 30, 2020 , 06:03:29

డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అధికారులకు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని అన్నారు. నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇంటి నిర్మాణాల్లో నాణ్యమైన ఇటుక, ఇసుక, సిమెంటును వాడాలని అధికారులను ఆదేశించారు. త్వరలో టెండర్లను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, ఐసీఏడీ డీఈలు రవికుమార్‌, భీమ్‌, మున్సిపల్‌ డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


VIDEOS

logo