బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Oct 30, 2020 , 06:00:47

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

కొడంగల్‌ :  మండల పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగించి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో పర్యటించిన ఆయన గ్రా మంలో కొనసాగుతున్న వైకుంఠధామం. వర్మికంపోస్టు షెడ్‌, ప్రకృతి వనం, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామం, వర్మి కంపోస్టు షెడ్‌, ప్రకృతివనం, మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా మండలాల్లో పూర్తి కావస్తున్నా యని, కొడంగల్‌ మండలంలో నత్త నడకన పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పనుల్లో  జ్యాపం జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాణ్యతతో పాటు త్వరగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత, ఏపీవో రాములుతో పాటు పంచాయతీ కార్యదర్శి  పాల్గొన్నారు.

VIDEOS

logo