ఆదివారం 29 నవంబర్ 2020
Vikarabad - Oct 29, 2020 , 06:35:20

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : ఎస్పీ నారాయణ

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : ఎస్పీ నారాయణ

 వికారాబాద్‌ రూరల్‌: ప్రజా సంరక్షణకై తమ ప్రా ణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అ మరవీరుల త్యాగాలు మరువలేనివని వికారాబా ద్‌ జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌడ్‌లో ఓపెన్‌ ఔజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తం గా వారంరోజులు పోలీసు సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు, ఆ యుధాల గూర్చి, పోలీసుల విధుల గురించి వి ద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. కొవిడ్‌ 19 కారణంగా విద్యార్థులు హాజ రు కాలేకపోయినందున ఆన్‌లైన్‌ ద్వారా ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఓపెన్‌హౌజ్‌లో ఏర్పాటు చేసి న స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ రత్నం, ఆర్‌ఎస్‌ఐ అశోక్‌రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.