ఆదివారం 29 నవంబర్ 2020
Vikarabad - Oct 29, 2020 , 06:32:20

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  బషీరాబాద్‌: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబ సు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో కొ నసాగుతున్న రైతువేదిక, కంపోస్టు షెడ్డు, ప్రకృతి వనం, శ్మశానవాటిక తదితర అభివృద్ధి పనులను బుధవారం ఆమె పరిశీలించారు. రైతు వేదికలను 10 రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్‌, అధికారులను ఆదేశించారు. రైతు వేదికకు వెంటనే విద్యుత్‌ మీటర్‌ ఏర్పాటు చేయాలని వి ద్యుత్‌ శాఖ ఏఈని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అ ధికారులతో కలిసి మండల కేంద్రంలోని వార్డుల్లో పర్యటించారు. మురుగు కాల్వలపై ఉన్న బెడ్‌లకు జాలి పెట్టాలని సూచించారు. డైరెక్ట్‌ పంపింగ్‌ వద్ద ట్యాప్‌లు బిగించాలని సర్పంచ్‌ ప్రియాంకకు సూచించారు. పల్లె ప్రకృతి వనాన్ని ప్రభుత్వ ప్రాథమిక దవాఖాన వద్దనే ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఉమాదేవిని ఆదేశించారు. పల్లె ప్ర కృతి వనంలో కచ్చితంగా రెండు వేల మొక్కలను నాటి, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్నారు. మైనార్టీ కాలనీలో పర్యటించి పారిశుధ్యంపై ప్రజలకు తెలియజేశారు. మరుగుదొడ్ల వ్యర్థాలు డైరెక్టుగా మురికి కాలువల్లో వదలడంపై కలెక్టర్‌ ఆసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల ను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలను మురుగు కాల్వల్లో వదలకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామం ప నులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నవాంద్గి గ్రామంలో ఐదో వార్డులో పర్యటించి వీధులు అపరిశుభ్రంగా ఉండటంతో సంబంధింత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం ఉన్న చోట సింటెక్స్‌ ట్యాంకులను ఏర్పాటు చేసి నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రూ. 230కే సి మెంట్‌ బస్తాను అందజేస్తున్నదని, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి ఏ ర్పాట్లను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌తో అధికారులు మాట్లాడుతూ వర్షం పడితే కార్యాల యం మొత్తం లీకేజీ అవుతుందని, విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. కలెక్టర్‌ స్పందించి ఇప్పటి వరకు విషయాన్ని ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నిం చగా లీకేజీ ఫోటోలు కలెక్టర్‌ కార్యాలయానికి పంపించా మని అధికారులు తెలిపారు.కార్యక్రమంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, తాసిల్దార్‌ షౌకత్‌అలీ, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్‌ ప్రియాంక, ఎంపీటీసీ రేఖ పాల్గొన్నారు.