గురువారం 03 డిసెంబర్ 2020
Vikarabad - Oct 25, 2020 , 08:02:31

వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

తాండూరు రూరల్‌ : భార్యతో అక్రమ సం బంధం పెట్టుకున్నాడని  వ్యక్తిని గొడ్డలితో నరికిన ఘటన కరణ్‌కోట పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి భార్యతో అదే గ్రామానికి చెందిన సతీశ్‌ (32)కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నా డు. రాత్రి పడుకున్న సమయంలో సతీశ్‌ ఇంటి తలుపులు తీసి, రాంచంద్రారెడ్డి భార్యను తీసుకొని బయటకు వెళ్తున్న క్రమంలో రాంచంద్రారెడ్డి చూసి సతీశ్‌ను వెంబడించాడు. పొలాల్లో పారిపోతుండగా సతీశ్‌ను గొడ్డలితో తల భాగంలో గట్టిగా నరికాడు. దీంతో అతను  కిందపడిపోయాడు.  హత్య చేసిన అనంతరం నేరుగా రాత్రి 11 గంటల తర్వాత పోలీసు స్టేషన్‌లో రాచంద్రారెడ్డి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సతీశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా దవాఖానకు తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.