శుక్రవారం 27 నవంబర్ 2020
Vikarabad - Oct 25, 2020 , 07:45:16

అంబరాన్నంటిన సద్దుల సంబురం

అంబరాన్నంటిన సద్దుల సంబురం

వికారాబాద్‌ : పట్టణంలో చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. శనివారం పట్టణంలోని పలు కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూలతో మొదలైన పూల పండుగ సద్దులతో ముగిసింది. తీరొక్క పువ్వులతో లోగిళ్లు పూల వనాలుగా మారగా ఉయ్యాల పాటలు మార్మోగాయి. +మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను అలంకరించారు.  ఎంఐజీ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల పాల్గొన్నారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వర ఆలయం సమీపంలోని కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు

బొంరాస్‌పేట : సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. బొంరాస్‌పేట, తుంకిమెట్ల, ఏర్పుమళ్ల తదితర గ్రామాలలో మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేశారు. గౌరీదేవికి పూజలు చేశారు. బతుకమ్మలను ఎత్తుకుని ర్యాలీ నిర్వహించారు.