మంగళవారం 01 డిసెంబర్ 2020
Vikarabad - Oct 24, 2020 , 06:06:39

పర్యాటక క్షేత్రంగా సుర సముద్రం చెరువు

పర్యాటక క్షేత్రంగా సుర సముద్రం చెరువు

ఆమనగల్లు: పట్టణంలోని సుర సముద్రం చెరువును అన్నివిధాలుగా సుందరీకరించి భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సురసముద్రం చెరువును ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు సుర సముద్రం చెరువు నిండింది. దీంతో గంగమ్మతల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లు సుర సముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా ప్రభుత్వం గుర్తించి, నిధులు విడుదల చేసిందన్నారు. ఇటీవల కురిసిన వానలకు నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు నిండాయన్నారు. దీనివల్ల సాగు, తాగు నీటికి భవిష్యత్తులో తిప్పలు ఉండవన్నారు. ఇరిగేషన్‌, మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తంగా ఉండి చెరువు సమీపంలో నివాసాలు ఉన్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన భానుకు రూ.లక్ష, పోలేపల్లికి చెందిన గణేశ్‌కు రూ.10 వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజురైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్‌ అర్జున్‌రావు, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ సత్యం నాయకులు తోట గిరి, రామకృష్ణ, లాలయ్య, ఖలీల్‌, అప్పం శ్రీను, బాలస్వామి, కిరణ్‌, రమేశ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.