ఆదివారం 29 నవంబర్ 2020
Vikarabad - Oct 24, 2020 , 05:58:43

మార్కెట్‌ కమిటీ పాలకవర్గానికి సన్మానం

మార్కెట్‌ కమిటీ పాలకవర్గానికి సన్మానం

తాండూరు: తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ పి.వెంకట్‌రెడ్డి, డైరెక్టర్లు పద్మమ్మ, ఆశప్ప, సప్తగిరిగౌడ్‌, భీంరెడ్డి, మహ్మద్‌ ఇర్ఫాన్‌, మల్లప్ప, కట్కం వీరేంద్రస్వామి, దినేశ్‌సింగ్‌ ఠాకూర్‌కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సవ్యంగా పాలన కొనసాగించాలని సూచించారు.  నూతనంగా నియమితులైన పాలకవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ  రైతుల సంక్షేమానికి, మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త, టీఆర్‌ఎస్‌ నేతలు డా.సంపత్‌కుమార్‌, పి.నర్సింహులు, నయీం, రాంలింగారెడ్డి, రాందాస్‌, శకుంతల, నర్సిరెడ్డి, సాయిరెడ్డి, శేఖర్‌, ఉమాశంకర్‌, అక్బర్‌బాబా, నరేందర్‌రెడ్డి  ఉన్నారు.