శుక్రవారం 27 నవంబర్ 2020
Vikarabad - Oct 23, 2020 , 06:31:49

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి...

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి...

వికారాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలకు ప్రజల్లో ఆదరణ చూసే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌ మం డలం పుల్‌మద్ది గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్‌ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వికారాబాద్‌ క్యాంపు కార్యాలయం ఆవరణలో వంద మంది  కాంగ్రెస్‌ పార్టీ వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.    కార్య క్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు భాస్కర్‌, సత్యయ్యగౌడ్‌  పాల్గొన్నారు. 

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ రూరల్‌ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని 31వ వార్డు దాసాంజనేయ యువజన సంఘం సభ్యులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను కరోనా నిబం ధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. వార్డు కౌన్సిలర్‌ గాయత్రి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనంతరెడ్డి, యువజన నాయ కులు గిరీష్‌కొటారి, శ్రీనివాస్‌గౌడ్‌, కిశోర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.