సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Oct 23, 2020 , 06:25:13

నాయినికి ఘన నివాళి

నాయినికి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర తొలి  హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలకు రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పలువురు హాజరై నివాళులర్పించారు.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి , రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ నాయినికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. షాద్‌నగర్‌ పట్టణ ముఖ్యకూడలిలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌ నాయిని  చిత్ర  పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

- న్యూస్‌ నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ 


VIDEOS

logo