గురువారం 26 నవంబర్ 2020
Vikarabad - Oct 23, 2020 , 06:22:04

ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి

ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి

కులకచర్ల: గ్రామాల్లో ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి సిబ్బంది కృషి చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం కులకచర్ల మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో వ్యవసాయశాఖ, ఐకేపీ సిబ్బంది, మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా లో రెండు సీహెచ్‌సీ సెంటర్లు ఉన్నాయని మోమిన్‌పేట్‌లో సీహెచ్‌సీ సెంటర్‌ ద్వారా వివిధ రకాల లావాదేవీలు కొనసాగుతున్నాయని, కులకచర్లలో కూడా చిరు ధాన్యాల ఉత్పత్తి, కొనుగోలుతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిం చాలని అన్నారు. దీనికి వ్యవసాయ శాఖ, ఐకేపీ సిబ్బంది గ్రామాల వారీగా రైతుల దగ్గరకు వెళ్లి వాళ్లు పండించిన పంటల వివరాలు సేకరించాలని సూ చించారు. ఈ నెల 30వరకు పంటల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కులకచర్ల ఎఫ్‌పీవోలు 2వేల మంది మహిళా రైతు ఉత్పత్తిదా రులు ఉన్నారని, వారు వాటా ధనం 500, సభ్యత్వం 100 చొప్పున చెల్లించా రని అన్నారు. వారికి ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ద్వారా వచ్చిన సీడ్‌ ఫండ్‌తో వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేశామన్నారు. మండలంలో సీహెచ్‌సీ కేంద్రంలో రూ. 27లక్షలతో వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేశామని వీటిని గ్రామా ల్లో రైతులకు అవసరమున్నవారికి అద్దెకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే డబ్బులతో కేంద్రాన్ని కొనసాగిస్తూ రైతులకు లాభసాటిగా వ్యవసాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే విధంగా సీహెచ్‌సీ కేంద్రం పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. దీనికి కేంద్రం నిర్వాహకులు, ఉత్పత్తిదారుల సంఘాల బీవోడీలు ప్రముఖపాత్ర పోషించాలని అన్నారు. వచ్చే నెల 5లోపు కులకచర్లలో సీహెచ్‌సీ కేంద్రాన్ని ప్రారంభించాలని అధి కారులను ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రారంభించామన్నారు. సీజనల్‌వారీగా వచ్చే పండ్లను కొనుగోలు చేయాలని అన్నారు. కులకచర్లలో ప్రారంభించిన కంపెనీని లాభాలతో నడిపించాలని తెలిపారు. మోమిన్‌పేట్‌లో నిర్వహించే కంపెనీలాగా కులకచర్లలో కూడా కంపెనీ లాభాలను ఆర్జించాలని సూచిం చారు. కులకచర్ల ఎఫ్‌పీవో ద్వారా 54మంది రైతులతో 94మెట్రిక్‌ టన్నుల మామిడి కాయలను కొనుగోలు చేసి అమ్మినట్టు కలెక్టర్‌ వివరించారు. రైతులు ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించి లాభంతో పాటు కంపెనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కులకచర్లలో సీహెచ్‌సీ సెంటర్‌లో వచ్చిన వ్యవసాయ సామగ్రిని పరిశీలించారు.

దివ్యాంగుల పునరావాస కేంద్రం పరిశీలన

కులకచర్ల మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య భవనంలో నిర్వ హిస్తున్న దివ్యాంగుల పునరావాస, మనోవికాస కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలిం చారు. కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం కుల కచర్లలో చెరువు దగ్గర కొనసాగుతున్న కూరగాయల మార్కెట్‌ స్థలాన్ని పరి శీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చెరువు ఎఫ్‌ టీఎల్‌ను ఇరిగేషన్‌ శాఖ ద్వారా చదును చేయించి కూరగాయల మార్కెట్‌కు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులు నిర్మించి వాటికి సంబంధించిన చెల్లింపులు చేయాలని అన్నారు. కులకచర్ల తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, డీఆర్డీవో కృష్ణన్‌, ఎంపీడీవో కాలూసింగ్‌, తాసిల్దార్‌ అశోక్‌ కుమార్‌, డిప్యూటీ తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావు, డీపీఎం శ్రీనివాస్‌, ఎంపీవో సుందర్‌, ఏపీఎం శోభ, మండల వ్యవసాయాధికారి వీరస్వామి, ఎఫ్‌పీవో చైర్మన్‌ కవిత, మేనేజర్‌ కుర్మయ్య  పాల్గొన్నారు.